Site icon NTV Telugu

Bhojpuri songs: డబుల్ మీనింగ్ ‘‘భోజ్‌పురి సాంగ్స్’’పై పోలీసుల ఉక్కుపాదం..

Bhojpuri Songs

Bhojpuri Songs

Bhojpuri songs: భోజ్‌పురి సినిమాలు, అక్కడి పాటలు అశ్లీలతక కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ముఖ్యంగా మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే పాటలపై, సినిమాలపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా అక్కడి సిని పరిశ్రమ తీరు మార్చుకోవడం లేదు. ముఖ్యంగా మహిళ శరీరాన్ని ఉద్దేశిస్తూ ‘‘డబుల్ మీనింగ్’’ పాటలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే, ఇలాంటి డబుల్ మీనింగ్ భోజ్‌పురి సాంగ్స్‌పై చర్యలు తీసుకునేందుకు బీహార్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇది ఒక ‘‘ బర్నింగ్ ఇష్యూగా, సామాజిక సమస్య’’గా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఇది మహిళల భద్రతకు ముప్పు కలిగిస్తోందని, పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పోలీసులు చెప్పారు.

Read Also: Minister: మహిళలు లిప్ స్టిక్‌తో పాటు కత్తి, కారం తీసుకెళ్లండి..

రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్‌లో అన్ని ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు (ఐజీలు), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు (డీఐజీలు), రైల్వే పోలీసులు బస్సులు, ట్రక్కులు, ఆటో-రిక్షాల్లో, ప్రజా కార్యక్రమాలలో ఇటువంటి పాటలు ప్లే చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

బీహార్ వ్యాప్తంగా ఈ సమస్య చాలా ఏళ్లుగా ఆందోళన కలిగిస్తోంది. అశ్లీల కంటెంట్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతిమ కుమారి రెండేళ్ల క్రితం అసెంబ్లీలో ఈ సమస్యని లేవనెత్తారు. సినిమాలు, సోషల్ మీడియాలో ఇలాంటి పాటల వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Exit mobile version