Liquor Bottles: ప్రమాదానికి గురైన కారు.. మద్యం బాటిళ్లతో జనాలు జంప్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
People Jumps with Liquor Bottles after Car Meets Accident In Gaya: అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా.. అందులో ఉన్న బాటిళ్లను జనాలు ఎత్తుకెళ్లారు. కారు నిండా ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను తీసుకుని జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్‌గా మారిన వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కార్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వివరాల ప్రకారం… విదేశీ మద్యం బాటిళ్లతో ఓ కారు సోమవారం (అక్టోబర్ 30) గయా నుంచి ధోబి-ఛత్ర జాతీయ రహదారిపై వెళుతోంది. చత్రా మలుపు వద్ద కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతున్న ఆ కారు.. ముందున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో రోడ్డు పైన వెళ్లే వారు సాయం చేసేందుకు వచ్చారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారు పారిపోయారు. కారు లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో.. సాయం చేసేందుకు వచ్చిన వారు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు. ఇది చూసిన ఇంకొందరు కూడా మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
Also Read: Health Tips : చలికాలంలో ఈ జ్యూస్ ను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కారు వద్ద భారీగా జనాలు గుమిగూడడంతో ధోబి-ఛత్ర రహదారిపై గందరగోళ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారులో ఉన్న మద్యం బాటిల్స్ ఖాళీ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక 2016 నుంచి బిహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. రాష్ట్రంలో మద్యం విక్రయించడం లేదా వినియోగం రెండూ శిక్షార్హమైన నేరం.
शराबबंदी!
बिहार के गया में कार का एक्सीडेंट हुआ, कार में शराब भरी हुई थी. फिर लोगों ने क्या किया, देखिए. pic.twitter.com/F6qvY1Nm3a
— Utkarsh Singh (@UtkarshSingh_) October 31, 2023
తాజావార్తలు
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!