NTV Telugu Site icon

Sonia Gandhi: రాష్ట్రపతిపై వ్యాఖ్యలు.. సోనియాగాంధీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది..

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్‌కి ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదిలా ఉంటే, రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలపై బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని కోర్టులో ఫిర్యాదు దాఖలైంది.

Read Also: Maha Kumbh Mela: కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణం.. 16,000 మొబైల్ నెంబర్లపై దర్యాప్తు..

దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని అగౌరపరిచారంటూ సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌కి చెందిన న్యాయవాది సుధీర్ ఓజా శనివారం ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను సహ నిందితులుగా ఓజా పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 1 కోర్టు ఈ విషయాన్ని విచారించనుంది.

బడ్జెట్ ప్రసంగం తర్వాత సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘‘రాష్టప్రతి చివరికి చాలా అలసిపోయారు… ఆమె మాట్లాడలేకపోయింది, పాపం,’’ అంటూ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని “బోరింగ్” గా అభివర్ణించారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా అక్కడే ఉన్నారు. సోనియా వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ ‘‘ఆమోదయోగ్యం కాదు’’ అని చెప్పింది.