NTV Telugu Site icon

PM Modi: మోడీకి ఓటేయొద్దని విద్యార్థులకు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి అరెస్ట్..

Bihar

Bihar

PM Modi: తరగతి గదిలో ‘‘మోడీకి ఎవరూ ఓటు వేయద్దు’’ అని చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీకి ఎవరూ ఓటేయద్దని చెప్పడం వివాదాస్పదమైంది. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం వెల్లడించడంతో, వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. ముజఫర్‌పైర్ ఎస్ఎస్పీ రాకేష్ కుమార్ ప్రకారం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశామని, జిల్లా విద్యాధికారి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు.

Read Also: Acid Reflux At Night : రాత్రి తరచూ గుండెల్లో మంట పుడుతుందా? అయితే ఇలా చేయండి..

కుర్హానీ బ్లాక్‌లోని అమ్రాఖ్ లోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల చెందిన ఉపాధ్యాయుడు హరేంద్ర రజక్ ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో ఎవరూ మోడీకి ఓటు వేయవద్దని చెప్పటినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఈఓ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఉచిత రేషన్ పథకం కింద మనుషులు తినేందుకు పనికిరాని ధాన్యాన్ని పంపిణీ చేస్తున్నందున మోడీకి ఓటు వేయవద్దని ఉపాధ్యాయుడు పిల్లలకు చెబుతున్నారని కుటుంబ సభ్యులు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారని డీఈఓ తెలిపారు.

చాలా మంది విద్యార్థిని, విద్యా్ర్థులు ఉపాధ్యాయుడు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ధృవీకరించారు. ప్రాథమికంగా ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ)ని ఉల్లంఘించడమే అవుతుందని, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం నిషేధించబడింది. దీంతో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు.