బీహార్‌లో భారీ విజయం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. సర్వేల అంచనాలు కూడా తల్లకిందులై అతి పెద్ద విజయం దిశగా అధికార కూటమి జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం 192 స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుండగా.. విపక్ష కూటమి 47 స్థానాల్లో వెనుకంజలో ఉంది. అంతేకాకుండా క్రమక్రమంగా ఆర్జేడీ లీడ్ కూడా తగ్గిపోతుంది. చాలా చోట్ల ఆర్జేడీ కంచుకోటలో కూడా పార్టీ ఘోరంగా చతికిలపడింది. ఇక కాంగ్రెస్ అయితే ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ముందంజలో ఉన్న చోట్ల కూడా వెనుకంజలోకి వచ్చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Prashant Kishor: అంతా భ్రాంతియేనా? ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఇదేనా?
ఆశ్చర్యం ఏంటంటే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా ఓట్ షేర్ పెరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 47 శాతం ఓట్ షేర్ వస్తే.. ప్రస్తుతం అది 50 శాతానికి పెరిగింది. తాజా లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమి 50 శాతం ఓట్ షేర్ సంపాదించింది.
ఇది కూడా చదవండి: Bihar Election Results: కూటమిని ముంచిన కాంగ్రెస్.. హస్తం పార్టీ పేలవ ప్రదర్శన..
