Site icon NTV Telugu

Daily Wager Gets IT Notice: రోజూ పనిచేస్తే తప్పా రూ.500 రావు.. రూ.37 లక్షలు కట్టాలని ఐటీ నోటీసులు

Daily Wager Gets It Notice

Daily Wager Gets It Notice

Bihar daily wager gets IT notice of Rs 37.5 lakh: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. దినసరి కూలీకి వెళ్తే కానీ ఆదాయం లేని వ్యక్తి. రోజు పని చేస్తే రూ. 500 నుంచి రూ. 1000 వచ్చే వ్యక్తి ఆదాయపన్ను కిందికి రాడని అందరికీ తెలుసు. కానీ అలాంటి వ్యక్తికి ఏకంగా రూ. 37.5 లక్షల ఆదాయపన్ను కట్టాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ లో ఉండటం ఆ దినసరి కూలీ వంతైంది.

వివరాల్లోకి వెళితే ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఖజారియా జిల్లాలో జరిగింది. మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తుంటాడు. అయితే ఇటీవల రూ.37.5 లక్షల బకాయిలు ఉన్నాయని వెంటనే చెల్లించాలని ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో ఇంత పెద్ద మొత్తం కట్టాలని నోటీసులు రావడం ఏంటని..? పోలీసులను ఆశ్రయించాడు సదరు వ్యక్తి.

Read Also: Vijayashanti: కేసీఆర్ BBCకి ఎవరూ లొంగొద్దు.. ఆయనకు బుద్ధి చెప్పండి

అయితే గిరిష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది మోసానికి సంబంధించిన కేసుగా పోలీసులు భావిస్తున్నామన్నారు అలౌలి పోలీస్ స్టేషన్ ఎస్సై పూరేంద్ర కుమార్. బాధితుడి పాన్ నెంబర్ ఆధారంగా ఆదాయపన్ను శాఖ నోటీసులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో చిన్నచిన్న పనులు చేసుకునే గిరీష్ కుమార్ ఆ సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా పాన్ కార్డు కోసం ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే ఆ తర్వాత మధ్యవర్తి కనిపించకుండా పోయాడని.. గిరీష్ కు వచ్చిన నోటీసులు రాజస్థాన్ లోని ఓ కంపెనీకి సంబంధించినవి పోలీసులు గుర్తించారు. అయితే తాను మాత్రం ఎప్పుడూ కూడా రాజస్థాన్ వెళ్ల లేదని గిరిష్ కుమార్ చెబుతున్నారు.

Exit mobile version