NTV Telugu Site icon

క‌రోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్ర సీఎస్ మృతి

Arun Kumar Singh

క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌మే సృష్టిస్తోంది.. ఎంతోమంది సామాన్యులే కాదు.. వీవీఐపీలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.. ఎవ్వ‌రైతే నాకేంటి అంటూ అంద‌రినీ ట‌చ్ చేస్తోంది వైర‌స్.. ఇత‌ర అనారోగ్య‌ స‌మ‌స్య‌లు ఉన్నా, అధైర్య‌ప‌డినా ప్రాణాలు తీస్తోంది.. ఇక‌, తాజాగా బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఆయ‌న‌.. పా‌ట్నాలోని ఓ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటుంటుండ‌గా.. ఇవాళ మ‌ధ్యాహ్నం ఆయ‌న ప్రాణాలు పోయాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. మ‌రోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో బీహార్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు అరుణ్‌కుమార్ సింగ్.. ఆయ‌న 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్. ఇక‌, బీహార్‌లో ప్రస్తుతం 1,00,822 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండ‌గా.. కోవిడ్ -19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,480 మంది ప్రాణాలు కోల్పోయారు.