Site icon NTV Telugu

Bihar: సీఎం విచిత్ర ప్రవర్తన.. పూల బొకేను ఆఫీసర్ నెత్తినపెట్టిన నితీష్‌కుమార్

Biharcm

Biharcm

అతిథులకు గానీ.. వీఐపీలకు గానీ స్వాగతం పలికేటప్పుడు పూల బొకేలు ఇవ్వడం సాంప్రదాయం. గౌరవం, మర్యాద. పెద్ద స్థాయి వ్యక్తులకు ఇచ్చే గౌరవం ఇది. అధికారులు పూల బొకేలను గానీ.. ఈ మధ్య చిన్న పూల కుండీలు ఇస్తున్నారు. అయితే బీహార్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపైన ఓ అధికారి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు చిన్న పూల కుండీని నితీష్‌ కుమార్‌కు ఇచ్చారు. వెంటనే ఆ పూల కుండీని అధికారి నెత్తిపైన పెట్టారు. దీంతో అధికారి అవ్వాక్కయ్యాడు. ఈ సందర్భంగా వేదికపైన ఉన్న వారంతా నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: UP: వికటించిన జుట్టు మార్పిడి శస్త్రచికిత్స.. ఇద్దరు ఇంజనీర్లు మృతి

పాట్నాలోని లలిత్ నారాయణ్ మిశ్రా ఇనిస్టిట్యూట్‌లో సోమవారం అపాయింట్‌మెంట్ లెటర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్ధార్థ పూల కుండీ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. పూల కుండీ తీసుకున్న ముఖ్యమంత్రి విచిత్రంగా ప్రవర్తించారు. ఆ పూల కుండీని ఆఫీసర్ నెత్తిపైన పెట్టారు. దీంతో అధికారి ఆశ్చర్యపోయాడు. ఇక అక్కడే ఉన్నవారంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Mirai : ‘మిరాయ్’ మరో కార్తికేయ-2 అవుతుందా..?

అయితే ఈ సందర్భం నవ్వులు తెప్పించినా మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలానే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ట్రెండింగ్ మారాయి. ఇక ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేశారు. ఆయన తీరును ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.

త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. ఇంకోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా అధికారం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి పోటాపోటీగా ప్రచారం ఉండేటట్టు కనిపిస్తోంది.

 

Exit mobile version