Site icon NTV Telugu

Nitish Kumar: ‘‘నితీష్ కుమార్‌ని ఉప ప్రధాని చేయాలి’’.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

Bjp

Bjp

Nitish Kumar: బీహార్‌కి చెందిన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ని ‘‘ఉప ప్రధానమంత్రి’’ అని అన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఎన్డీయేకు నితీష్ కుమార్ చాలా కృ‌షి చేశారని అన్నారు. బీహార్ ఎన్నికల ముందు బీజేపీ నాయకుడు చేసిన ప్రకటన అందర్ని ఆశ్చర్యపరిచింది.

Read Also: Tenali Double Horse: “రూరల్ టు గ్లోబల్” లక్ష్యంతో ‘మిల్లెట్ మార్వెల్స్’ను లాంచ్ చేసిన తెనాలి డబుల్ హార్స్

వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నితీష్ కుమార్‌కి గౌరవప్రదమైన నిష్క్రమణ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘‘ఉప ప్రధాని’’ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాట్నాలో విలేకరులతో మాట్లాడిని మాజీ కేంద్రమంత్రి.. ‘‘ఎన్డీకేకు నితీష్ కుమార్ చేసిన కృషి అపారమైనది. ఆయన ప్రధాని మోడీని బలోపేతం చేస్తున్నారు. ఆయనను ఉపప్రధాని చేయాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నిజమైతే బాబు జగ్జీవన్ రామ్ తర్వాత బీహార్ నుంచి అత్యున్నత పదవి అలంకరించిన నేతగా నితీష్ కుమార్ ఉంటారు’’ అని అన్నారు.

బుధవారం బక్సర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విని చౌబేని మీడియా ప్రశ్నించింది. పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్, ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా తక్కువ పోరాడుతాయని, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎక్కువ పోరాడుతాయని అన్నారు. దీనిపై అశ్విని చౌబేని ప్రశ్నించగా, నితీష్ కుమార్ చాలా కాలంగా ఎన్డీయేలో సమన్వయకర్త పాత్రను పోషిస్తున్నారని, ఆయనకు ఉప ప్రధాని హోదా ఇస్తే అది బీహార్‌కి గర్వకారణమని అన్నారు. నవంబర్ 2025లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ పొత్తుగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ ఆర్ఎల్డీ ఇండీ కూటమి ఉంది.

Exit mobile version