Site icon NTV Telugu

తగ్గిన కేసులు.. అక్కడ ఈవారమే స్కూళ్లు ఓపెన్

Nitish Kumar

Nitish Kumar

కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలమే సృష్టించింది.. క్రమంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. మరికొన్ని ప్రాంతాల్లో పెరిగినా.. ఎక్కువ రాష్ట్రాలు పాజివిటీ రేటు పడిపోయింది.. దీంతో.. ఆంక్షలు ఎత్తివేస్తూ.. సడలింపులు ఇస్తూ వస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు.. బీహార్‌లో కూడా ఈ నెల 7వ తేదీ నుంచి షాపులు, స్కూళ్లు తెరుచుకోనున్నాయి. పాజిటివ్‌ కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించిన బీహార్‌ ప్రభుత్వం.. ఆగస్టు 7 నుంచి 25 వరకు సెలవు రోజుల్లో తప్ప.. మిగతా రోజుల్లో అన్ని షాపులు తెరుచుకుంటాయని ప్రకటించింది.

ఆగస్టు 7వ తేదీ నుంచి స్కూళ్లు కూడా ఓపెన్‌ చేస్తామని.. 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 7వ తేదీ నుంచి, 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ నెల 16 నుంచి ప్రత్యక్ష క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్. ఇక, కోచింగ్ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చామని.. కానీ, 50 శాతం సామర్థ్యంతో పని చేస్తాయని, బస్సులు, ప్రజా రవాణా వంద శాతం సామర్థ్యంతో నడుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు.. షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు కూడా తెరచుకోనున్నాయి.. కాకపోతే కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం నితీష్ కుమార్.

Exit mobile version