Site icon NTV Telugu

Bihar Election: నితీష్‌కుమార్‌కు షాక్!.. బీజేపీ సీఎం అభ్యర్థిని ఫోకస్ చేసే యోచనలో అధిష్టానం!

Chief Minister Of Bihar

Chief Minister Of Bihar

బీహార్‌లో ఏడాది చివరి కల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: India: రష్యా చమురు కొనుగోళ్లకు భారత్‌ బ్రేక్‌..?

అయితే తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రజాదారణ తగ్గినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల స్టేట్ వైబ్ సర్వే ఆఫ్ బీహార్ ఎలక్షన్స్ 2025 (కుల-సమాజ వారీ ఓటింగ్) ప్రకారం 25 శాతం మందే నితీష్ కుమార్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌నే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని 32.1 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. ఇక నితీష్ వైపున 38 శాతం ఎస్టీలు, 27 శాతం ఎస్సీ, ముస్లింలు, 24 శాతం ఉన్నత తరగతి హిందువులు, 21 శాతం ఓబీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 శాతం మంది ముస్లింలు తేజస్వి యాదవ్ వైపే ఉన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ..

ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ సొంత ముఖ్యమంత్రిని చూడాలని అనేక మంది ఓటర్లు కోరుకున్నట్లు సర్వేలో తేలింది. 33.7 శాతం మంది బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కోరుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వేరే మార్గం లేకపోతే నితీష్‌ కుమార్‌ను 23.1 శాతం మందే కోరుకుంటున్నారు

అయితే బీహార్ సమగ్ర అభివృద్ధి కోసం ఏ పార్టీని విశ్వస్తారన్న ప్రశ్నకు మహాఘట్బంధన్‌కు 36.1 శాతం మంది స్వల్ప ఆధిక్యత కనిపించగా.. ఎన్డీఏకు మాత్రం 35.4 శాతం మంది విశ్వసిస్తున్నట్లు చెప్పారు. నితీష్ కుమార్‌కు ప్రజాదారణ దెబ్బతినడంతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫోకస్ చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితీష్ కుమార్ పలుమార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎం అభ్యర్థిని నిలబెడితే.. తిరిగి అధికారంలోకి రావొచ్చని ఎన్డీఏ భావిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version