Site icon NTV Telugu

Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్‌ సమాచారంపై..!

Ajit Pawar Plane Crash

Ajit Pawar Plane Crash

దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే తాజాగా విమానంలో ఉన్న రెండు ఫ్లైట్ రికార్డర్లు తీవ్రమైన వేడి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించింది. దీంతో సమాచారాన్ని సేకరించేందుకు తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కాక్‌పిట్ ఆడియో డేటాను సేకరించేందుకు విదేశీ సహాయాన్ని కోరాయి. భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక విదేశీ సహాయం కోరినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

విమానంలో రెండు స్వతంత్ర ఫ్లైట్ రికార్డర్లు ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR). రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ఉంది. ప్రమాదం సమయంలో రెండు పరికరాలు ఎక్కువసేపు వేడికి గురి కావడంతో దెబ్బతిన్నట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. నష్టం జరిగినప్పటికీ L3-కమ్యూనికేషన్స్ తయారు చేసిన DFDRని ఫ్లైట్ రికార్డర్ లాబొరేటరీలో AAIB విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హనీవెల్ తయారు చేసిన CVRను సేకరించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ సహాయం కోరాల్సి వచ్చింది.

జనవరి 28న అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. బారామతిలో ల్యాండింగ్ జరుగుతుండగా ప్రమాదశాత్తు కూలిపోయింది. దీంతో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంపై ఎన్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేయడంతో దర్యాప్తు బృందాలు సీరియస్‌గా తీసుకున్నారు.

Exit mobile version