NTV Telugu Site icon

MCD Election: మేయర్ ఎన్నికలో బిగ్‌ ట్విస్ట్‌ తప్పదా? ఆమ్‌ఆద్మీకి కొత్త టెన్షన్‌..

App

App

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల్లో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ.. తొలిసారి ఎంసీడీలో పాగా వేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించేలా సీట్లు సాధించింది.. మొత్తం 250 వార్డులకు గాను మేజిక్‌ ఫిగర్‌ 126 సీట్లు ఉండగా.. అంతకంటే ఎక్కువగానే అంటే ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది.. ఇక, బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఘోర ఓటమి తప్పలేదు.. కేవలం 9 వార్డులకే పరిమితమైంది. ఇక, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించారు.. అయితే, ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించడం ఇదే తొలిసారి.. ఢిల్లీ అసెంబ్లీలో రెండుసార్లు విజయం సాధించినా.. కార్పొరేషన్‌లో ఇదే తొలిసారి కావడంతో.. సంబరాల్లో మునిగిపోయాయి ఆ పార్టీ శ్రేణులు.. ఇంతవరకు బాగానే ఉన్నా.. మేయర్‌ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌ తప్పదా? అనే టెన్షన్‌ ఆమ్‌ఆద్మీ పార్టీని వెంటాడుతోంది.

Read Also: CM Jagan : పార్టీ నేతలతో నేడు సీఎం జగన్ సమీక్ష

ఇప్పటికే, బీజేపీ తన గేమ్‌ప్లాన్‌ మొదలు పెడుతుందనే ఆప్‌ నేతలు వ్యాఖ్యానించారు.. అయినా, తమ కార్పొరేటర్లు ప్రలోభాలకు గురికారని చెబుతున్నారు.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్‌ ఉంది.. మెజార్టీ స్థానాలు సాధించిన ఆప్‌కు బీజేపీ షాక్‌ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు 12 మంది కౌన్సి లర్లను నియమించే అధికారం ఉంది.. ఆయన గనక 12 మంది బీజేపీకి చెందినవాళ్లనే నియమిస్తే.. మేయర్ ఎన్నికలో ఉత్కంఠ తప్పదు.. ప్రస్తుతం బీజేపీకి 104 మంది కౌన్సిలర్ల ఉండగా.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ 12 మందిని ఆ పార్టీకి చెందినవారినే నియమిస్తే మాత్రం.. ఆ పార్టీ సభ్యుల సంఖ్య 116కు చేరనుంది.. అయినా నష్టం లేదు అనుకోవచ్చు.. ఎందుకంటే ఆప్‌కు 134 మంది సభ్యులు ఉన్నారు గనుక మేయర్‌ కావడం సులువే అనుకోవచ్చు.. అయితే, ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ ఉంది.. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మేయర్ ఎన్నికకు ఫిరాయింపుల చట్టం వర్తించబోదు.. అంటే.. ఒకపార్టీలో గెలిచి మరో పార్టీలో చేరినా ఆపే శక్తి.. అతడిని పోటీలో నిలిపిన పార్టీకి ఉండదు.. పార్టీలు విప్ జారీ చేయడానికి కూడా వీలు ఉండదు.. మరోవైపు, కాంగ్రెస్‌ నుంచి 9 మంది, ఇండిపెండెంట్లు ముగ్గురు విజయం సాధించారు.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చేసినట్టు.. కొందరు కార్పొరేటర్లపై కమలం పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించిందంటే.. ఢిల్లీ మేయర్‌ పీఠం మరోసారి బీజేపీ వశం కావడం గ్యారంటీ.. దీంతో, ఢిల్లీలో ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Show comments