Swati Maliwal assault: స్వాతి మలివాల్ దాడి కేసు.. ఫోన్ ఫార్మాట్ చేసిన బిభవ్ కుమార్, సీసీటీవీ ట్యాంపరింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal assault: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఆప్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దాడికి పాల్పడిన బిభవ్ కుమార్‌ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎయిమ్స్ నివేదికలో స్వాతిమలివాల్ కాలిపై, చెంపపై గాయాలు ఉన్నట్లుగా తేలింది. ఇదిలా ఉంటే, నిందితుడిగా ఆరోపించబడుతున్న బిభవ్ కుమార్ తన ఫోన్‌ని ఫార్మాట్ చేశాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అతను ఫోన్‌ని ఫార్మాట్ చేసి దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు.
మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బిభవ్ కుమార్ కస్టడీ కోరుతూ తన రిమాండ్ రిపోర్టులో, అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందు అతను తన ఫోన్‌ని ముంబైలో ఫార్మాట్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. శనివారం బిభవ్ కుమార్ బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ కోర్టు దీనిని తోసిపుచ్చుతూ, 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కొన్ని లోపాల కారణంగా తన మొబైల్ ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అతను పోలీసులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిభవ్ కుమార్ ఫోన్ నుంచి డేటా పొందేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని కోరే అవకాశం ఉంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ!
ఆదివారం కేజ్రీవాల్ నివాసం నుంచి దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఖాళీగా ఉన్నందున సాక్ష్యాలు తారుమారు చేసి ఉంటారని పోటీసులు అనుమానిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసం నుంచి ఆదివారం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి బిభవ్ కుమార్‌ని ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
స్వాతి మలివాల్‌పై దాడి జరగలేదని ఆప్ మంత్రి అతిషి మార్లెనా ఆరోపించారు. ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణించారు. స్వాతి మలివాల్ అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో బీజేపీ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తోందని అన్నారు. మరోవైపు ఈ అంశం బీజేపీ వర్సెస్ ఆప్‌గా మారింది. స్వాతి మలివాల్‌పై దాడి గురించి కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!