భారత ప్రధాని మోడీ తనకు పెద్దన్న లాంటివారని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా షెరింగ్ టోబ్గే మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో నాయకత్వం గురించి పెద్దగా తెలిసేది కాదని.. అందుకు తాను అర్హుడిని కాదని అనుకునేవాడినని తెలిపారు. ప్రస్తుతం భారత్ పర్యటనకు ఓ విద్యార్థిగా మాత్రమే వచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరొందిన మోడీ నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకొనే అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun : అట్లీ – అల్లు అర్జున్ రెడీ టు రూల్..
మోడీ.. పదేళ్ల నుంచి భారత్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు. నాయకత్వం అనేది కేవలం బిరుదుల్లో ఉండదని.. వారు చూసే దృష్టికోణంలో ఉంటుందని అన్నారు. సరైన నాయకులు తమ దేశాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసకువెళ్లగలరని.. అటువంటి నాయకుడే ప్రధాని మోడీ అని ప్రశంసలు కురిపించారు.
ఇది కూడా చదవండి: Toilet Usage Management Rule: ఉద్యోగులు టాయిలెట్స్ వినియోగంపై వింత రూల్స్!