Site icon NTV Telugu

Bhupesh Baghel: మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎంకి రూ.508 కోట్ల చెల్లింపులు.? ఈడీ సంచలన ఆరోపణలు..

Bhupesh Baghel

Bhupesh Baghel

Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ. 508 కోట్లు చెల్లింపులు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పేర్కొన్నారు.

రూ.5 కోట్లతో పట్టుబడి కొరియర్, మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్ కి రూ. 508 కోట్లు చెల్లింపులు చేసినట్లు చెప్పారని ఈడీ పేర్కొంది. తన వద్ద ఉన్న డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు బఘేల్‌కి డెలివరీ చేయడానికి ఉద్దేశించినట్లు సదరు కొరియర్ అసిమ్ దాస్ ఈడీ ముందు చెప్పాడు. రాష్ట్రంలో తొలి దశ ఎన్ని ఎన్నికల్లో నాలుగు రోజుల ముందు ఈ ఆరోపణలు వస్తున్నాయి.

Read Also: Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..

ఈ క్రమంలో శుభమ్ సోనీ (మహాదేవ్ నెట్‌వర్క్ స్కాం నిందితుల్లో ఒకడు) అసిమ్ దాస్‌కు పంపిన ఈమెయిల్‌ను పరిశీలించగా, కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. గతంలో జరిగిన చెల్లింపులకు సంబంధించిన కీలక సమాచారం సదరు మెయిల్‌లో వున్నట్లు తెలిపింది. అలాగే మహాదేవ్ యాప్ ప్రమోటర్లు.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు దాదాపు రూ.508 కోట్లు చెల్లించినట్లుగా ఈడీ సంచలన ప్రకటన చేసింది.

గురువారం ఈడీ హోటల్ ట్రిటాన్, భిలాయ్ లోని మరో ప్రదేశంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. 5.39 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. మహదేవ్ బెట్టింగ్ యావ్ నిర్వహకులు విదేశాల్లో ఉండీ, ఛత్తీస్గడ్ లోని తన సన్నిహితులతో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది. మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇటీవలే తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మంది నిందితులుగా ఉన్నారు.

Exit mobile version