Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
- నేపాల్ వరదలతో భారత్ అప్రమత్తం..
- బీహార్, యూపీలో హై అలర్ట్..
- నేపాల్‌లో వరదలకు కారణమై అదే నది బీహార్ లోకి..
- భోటేకోశి నదిని బీహార్‌లో కోసిగా పిలుస్తారు..
- బీహార్ దు:ఖదాయినిగా కోసికి పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Flash Floods: నేపాల్‌లో భోటేకోశి నది విధ్వంసం సృష్టించింది. హఠాత్తుగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ రుసువా జిల్లా అతలాకుతలమైంది. ఇప్పటి వరకు వందలాది మంది ఈ వరదల్లో గల్లంతయ్యారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి రోడ్లు, గ్రామాలు కొట్టుకుపోయాయి. 10కి పైగా జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ నది టిబెటన్ హిమాలయ ప్రాంతంలో ఉద్భవించి, నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్ మరియు రసువా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. నేపాలీలో “భోటే” అంటే టిబెటన్ అని అర్థం. అంటే ఇది టిబెట్‌లో ఉద్భవించిన కోషి నది యొక్క ఉపనది. తర్వాత భోటేకోషి నది సుంకోషి నదిలో కలుస్తుంది. సుంకోషి, అరుణ్, తమూర్ తదితర నదులు కలిసి చివరకు కోషి నదీ వ్యవస్థగా మారి భారతదేశంలోని బీహార్‌లోకి ప్రవహిస్తుంది.
Also Read
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
నేపాల్‌లో విలయం సృష్టించిన అదే నది బీహార్‌లోకి..
ఇదిలా ఉంటే, నేపాల్ వరదలు భారతదేశంలో భయాన్ని పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి పెను ప్రమాదం పొంచిఉంది. నేపాల్ వరదలకు కారణమైన భోటేకోశి నది టిబెట్‌లో పుట్టి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తుంది. బీహార్‌లో దీనిని కోసి నదిగా పిలుస్తారు. కోసి నదిని ‘‘బీహార్ దుఃఖదాయిని’’గా పిలుస్తారు. ఈ నది కారణంగా బీహార్ ప్రాంతంలో తరుచుగా వరదలు రావడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.
బీహార్, యూపీల్లో ప్రభుత్వం అప్రమత్తం..
నేపాల్ వరదల నేపథ్యంలో బీహర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టాలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేపాల్ నుంచి భారత మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే నదుల్లో గండక్(నారాయణి), కోసి నదుల ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చైదరి మాట్లాడుతూ.. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎస్, డీజీపీలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాలకు తానే వెళ్తానని చెప్పారు. నదీ ప్రవాహక ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాలను అప్రమత్తం చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గండక్, నారాయణి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!