Site icon NTV Telugu

India Pakistan Conflict: పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే.. దాక్కోవడానికి కలుగు వెతుక్కోవాలి!

Army

Army

India Pakistan Conflict: పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమేర్‌ ఇవాన్‌ డి కున్యా పేర్కొన్నారు. పాక్‌లోని ప్రతి ప్రదేశం మీద భారత్‌ రేంజ్‌లోనే ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం తమ ప్రధాన కార్యాలయాన్ని రావిల్పిండి నుంచి మారుమూల ప్రాంతానికి తరలించినా.. అక్కడ కూడా వారు కలుగు వెతుక్కొని మరి అందులో దాక్కోవాల్సిందేంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఇక, పాకిస్తాన్‌ మొత్తాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం దగ్గర తగినన్నీ ఆయుధాలు ఉన్నాయని ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమేర్‌ తెలిపారు. ఇటీవల పాక్ చేసిన దాడిని ఇండియన్ ఆర్మీ, నేవీ, వైమానిక దళం సమన్వయంతో సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. పాక్ లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పాకిస్తాన్ భారత్ లోని పౌరుల ఇళ్లపై దాడులకు ప్లాన్ చేసినప్పటికీ ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పికొట్టిందన్నారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సదరు ఆర్మీ అధికారి వెల్లడించారు.

Exit mobile version