Bharat Taxi: నగరాల్లో నిత్యం వేలాది మంది డ్యూటీలకు వెళ్లేందుకు, ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి యాప్స్‌లో బైక్, ఆటో, క్యాబ్‌లు బుక్ చేసుకుంటున్నారు. వీటికి డిమాండ్ బాగా పెరగడంతో ఆయా కంపెనీలు భారీగా ధరలను పెంచేశాయి. పెంచిన ఛార్జీల్లో వాహన యాజమానులకు కూడా పెద్దగా ఇవ్వడం పోవడంతో అటు వాహనదారులు, ఇటు కస్టమర్లకు నష్టం జరుగుతోంది.
అయితే, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత్ ట్యాక్సీ అనే సరికొత్త యాప్‌ను రూపొందిస్తుంది. అతి తక్కువ ధరతో దేశ ప్రజలకు ట్యాక్సీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను క్రియేట్ చేసినట్లు తెలిపింది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1వ తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులోకి రాబోతుంది. మొదట ఈ భారత్ ట్యాక్సీ యాప్‌ను ఢిల్లీలో స్టార్ట్ చేయనున్నారు. అనంతరం దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారు.
Read Also: Bhumana Karunakar Reddy: టీటీడీకి తీరని ద్రోహం జరుగుతోంది.. మాజీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు..
ఇక, ఈ యాప్ రాకతో ‘ఓలా’, ‘ఉబర్’ సర్జ్ ధరల నుంచి కస్టమర్లకు రిలీఫ్ కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తం ఛార్జ్‌లో డ్రైవర్లకు 80 శాతానికి పైగా అందేలా ఈ యాప్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ యాప్‌కు వాహనదారుల నుంచి కూడా భారీ ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే, ఢిల్లీలో 56,000 మంది డ్రైవర్లు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ యాప్‌లో ఆటోలు, కార్లు, బైక్‌లను కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది.
