NTV Telugu Site icon

Sunita Williams: సునీతా విలియమ్స్‌కు భారతరత్న ఇవ్వాలి.. బెంగాల్ సీఎం డిమాండ్

Sunitawilliams5

Sunitawilliams5

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ ట్విట్టర్‌లో ఆమెను భారత కుమార్తెగా మమత అభివర్ణించారు. తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో పరిశోధన కోసం అంకితభావంతో పని చేసిందని సునీతాను ప్రశంసించారు. ఇక అసెంబ్లీలో సునీతా విలియమ్స్‌కు సభ్యులు అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Legislators Sports Meet: లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం.. బహుమతులు ప్రదానం చేయనున్న సీఎం!

అసెంబ్లీలో మమత మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్.. అంతరిక్షంలో తొమ్మిది నెలల పాటు అంకిత భావంతో పని చేసిందని ప్రశంసించారు. ఆమెను భారతరత్న పురస్కారంతో సత్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రెస్క్యూ ఆపరేషన్ బృందాన్ని కూడా ప్రశంసించారు. సునీతా క్షేమంగా భూమ్మీద రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. బుచ్ విల్మోర్, సునీతా ధైర్యాన్ని మెచ్చుకోవల్సిందేనన్నారు. తనకు అంతరిక్ష శాస్త్రం అంటే ఆసక్తేనన్నారు. వివిధ సమాచారాల ద్వారా వివరాలు తెలుసుకుంటానని చెప్పారు.

ఇది కూడా చదవండి: AP Legislators Sports Meet: లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం.. బహుమతులు ప్రదానం చేయనున్న సీఎం!

సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ దాదాపు 286 రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోయారు. వాస్తవానికి వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా.. సాంకేతిక లోపంతో తిరిగి రాలేకపోయారు. బుధవారం సునీతా భూమ్మీద అడుగుపెట్టారు. చాలా ఉల్లాసంగా ఆమె కనిపించారు. అందరికీ హాయ్ చెబుతూ క్షేమంగా భూమ్మీద కాలు పెట్టారు.

ఇది కూడా చదవండి: Merchant Navy officer Murder: వెలుగులోకి నిందితురాలి వాట్సప్ చాట్.. హతుడి సోదరికి ఏం పంపిందంటే..!