పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశంలో ఆమ్‌ఆద్మీ పార్టీ రెండో రాష్ట్రంలో పాలనా పగ్గాలను చేపట్టబోతుంది. ఇప్పటికే ఢిల్లీ పగ్గాలను అందుకున్న ఆప్.. ఇటీవల పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీని దక్కించుకుంది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఏకంగా 92 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. ఆప్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన భగవంత్ మాన్ సింగ్ ఇవాళ పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ జన్మించిన ఖట్కర్ కలాన్ గ్రామంలో మధ్యాహ్నం 12:30 గంటలకు భగవంత్‌మాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ .. భగవంత్ మాన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి… ఈ వేడుకకు దాదాపు 4నుంచి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఆప్ నేతలు. లక్షమంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
