ఒడిశాలోని భద్రక్‌లో ఒక పోలీసు అధికారి తీవ్ర నిర్లక్ష్యం వహించిన కేసు వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉన్నప్పుడు.. అతడు ఓ కేసు విషయంలో తన స్థానంలో దర్యాప్తు చేయడానికి ఒక యువకుడిని గ్రామానికి పంపాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు.
Read Also:Tragedy: టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద మృతి
పూర్తి వివారాల్లోకి వెళితే.. భద్రక్ గ్రామీణ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ కార్తీక్ జెనా విధుల్లో అలసత్వం ప్రదర్శించాడు. ఒక మహిళకు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి ధమ్‌నగర్ బ్లాక్‌లోని ధూసూరి ప్రాంతానికి చెందిన పియూష్ రంజన్ పాండా అనే యువకుడిని జెనా గ్రామానికి పంపాడు. ఈ విషయం ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి చేరడంతో… సబ్-ఇన్‌స్పెక్టర్ కార్తీక్ జెనాను సస్పెండ్ చేశారు.
Read Also:Buffalo Vs Lion: పిల్ల కోసం తల్లి బలి.. మనుషుల ప్రేమ కంటే ఏమాత్రం తగ్గదని నిరూపించిన అడవి బర్రె
తన దర్యాప్తు విధులను ఒక పౌర యువకుడికి అప్పగించినందుకు అతడి సస్పెండ్ చేశామని భద్రక్ ఎస్పీ తెలిపారు. ఆ యువకుడు పోలీసు అధికారిగా నటించి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించాడు.ఆ యువకుడిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. పాండా యొక్క పరస్పర విరుద్ధమైన సమాధానాలపై గ్రామస్తులు అనుమానం వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు.ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతనిపై అరెస్టు చేసి, వేషధారణ అభియోగం మోపారు. పోలీసు చర్య: సంఘటనను నిర్ధారించిన తర్వాత, భద్రక్ ఎస్పీ మనోజ్ రౌత్ “విధి నిర్లక్ష్యం మరియు అధికార దుర్వినియోగం” కారణంగా SI జెనాను సస్పెండ్ చేశారు. విధులను నిర్లక్ష్యం చేసిన ఏ అధికారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రక్ ఎస్పీ పేర్కొన్నారు.
