NTV Telugu Site icon

Rahul Gandhi: గాంధీ సిద్ధాంతాలకు ద్రోహం.. రాహుల్ గాంధీ శిక్షపై ఇండో-అమెరికన్ పొలిటీషియన్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై పలువురు విదేశీ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు భారత-అమెరికా సంతతి నేత రో ఖన్నా స్పందించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడం గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని, ఇది భారతీయ విలువలకు తీవ్రమైన ద్రోహం అని ట్వీట్ చేశాడు. రోఖన్నా యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటివ్స్ లో సిలికాన్ వ్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మా తాత ఏళ్ల తరబడి జైలు జీవితాన్ని త్యాగం చేసింది దీని కోసం కాదని రోఖన్నా అన్నారు. భారతదేశం, ఇండో-అమెరికన్ కాంగ్రెషనల్ కాకస్ కో-చైర్మన్ గా ఉన్న రోఖన్నా ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ జోక్యాన్ని కోరారు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also: Bhagwant Mann: పంజాబ్ మరో ఆఫ్ఘనిస్తాన్ కాకూడదు.. మతోన్మాద శక్తులతో జాగ్రత

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ అనర్హత ప్రజాస్వామ్యానికి విచారకరమైన రోజు అని యూఎస్ఏలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ జార్జ్ అబ్రహం అన్నారు. మోడీ సర్కార్ ప్రతిచోటా భారతీయుల వాక్ స్వాతంత్ర్య హక్కు మరియు స్వేచ్ఛకు చరమగీతం పాడుతోందని ఆయన మండిపడ్డారు.

2019 కర్ణాటక కోలార్ సభలో ‘‘మోదీ ఇంటి పేరున్న వాళ్లంత దొంగలే’’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఏ ప్రజాప్రతినిధికి అయినా రెండేళ్లు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష విధిస్తే వెంటనే డిస్ క్వాలిఫై అవుతారు. దీంతో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. అయితే పైకోర్టులో శిక్షపై స్టే విధించకుంటే రెండేళ్లు జైలు శిక్ష ఆ తర్వాత ఆరేళ్లు మొత్తంగా 8 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు అవుతాడు.