Site icon NTV Telugu

Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..

Untitled Design (2)

Untitled Design (2)

బెంగళూరులో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతుంది. రూఫేనా అగ్రహారంలో ఓ వ్యక్తి హెల్మెట్ బదులు కడాయి పెట్టుకున్నారు. కానీ ఇది కావాలని పెట్టుకున్నడా.. లేక హెల్మెట్ లేక పెట్టుకున్నాడా అనేది.. పూర్తిగా తెలియదు. అయితే ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Read Also: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రూఫేనా అగ్రహారంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతున్నారు. అయితే బైక్ పై కూర్చున్న మరో వ్యక్తి.. ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు.. నెత్తిన హెల్మెట్ బదులు.. కడాయి పెట్టుకున్నాడు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వాహానదారులు ఈ దృశ్యాన్ని చూస్తూ కాసేపు నవ్వుకున్నారు. కానీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి మాత్రం ఈ తతంగమంతా షూట్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… వీడియో తెగ వైరల్ అవుతుంది.

Read Also:Bike Stunt: మీ రీల్స్ పిచ్చి తగలెయ్య… స్టంట్స్ చేస్తూ బొక్కబోర్ల పడ్డ జంట

అయితే వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్..? ఫ్రయింగ్ పాన్‌తో ఆమ్లెట్‌ చేయవచ్చు.. కానీ ప్రాణాన్ని కాపాడలేమని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు. హెల్మెట్‌ అనేది ఫ్యాషన్‌ ఐటమ్‌ కాదని, ప్రాణ రక్షణ సాధనం అని, ఇలాంటి ‘జుగాడ్’లు ప్రాణాలతో ఆటలు ఆడటమేనని మరోకరు కామెంట్ చేశారు. ట్రాఫిక్‌ నియమాలు కేవలం చలాన్‌ నుంచి తప్పించుకోవడానికి కాదు, తమ భద్రత కోసమని,హెల్మెట్‌ ధరించి బైక్ నడపాలని నెటిజన్ కామెంట్ పెట్టారు.

Exit mobile version