Bengaluru: బెంగళూర్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో ‘‘ఎల్లో లైన్’’ ప్రారంభానికి సిద్ధం.. స్టేషన్లు ఇవే..
- బెంగళూర్ మెట్రో ‘‘ఎల్లో లైన్’’ సిద్ధం..
- ఆగస్టులో ప్రారంభానికి ఏర్పాట్లు..
- నగరంలో మరింత కనెక్టివిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్‌లోని నమ్మ మెట్రో ‘‘ఎల్లో లైన్’’ త్వరలో ప్రారంభంకాబోతోంది. రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్), బొమ్మసంద్రను కలిపే ఈ మెట్రో లైన్ తుది భద్రతా తనిఖీలు చేస్తు్న్నారు. జూలై 22 నుండి జూలై 25 వరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS) ఈ భద్రతా తనిఖీని నిర్వహిస్తారు. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది.
బెంగళూర్‌లో కనెక్టివిటీ మరింత పెంచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, గ్రీన్-పింక్ లైన్స్ డైరెక్ట్ ఇంటర్‌చేంజ్‌ను అందించడం ఎల్లో లైన్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల చాలా జాప్యాన్ని ఎదుర్కొంది. పలుమార్లు డెడ్‌లైన్ మిస్ అయింది. తాజా నివేదికల ప్రకారం, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఈ సంవత్సరం ఆగస్టులో ఈ లైన్‌ను ప్రారంభించనుంది. ముందుగా ఈ మార్గంలో మూడు మెట్రో రైళ్లను నడపనున్నారు. ఆ తర్వాత మరిన్ని జోడించే అవకాశం ఉంది.
Also Read
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి ఐటీ సంస్థలకు నిలయంగా ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా ఎల్లో లైన్ వెళ్తుంది. ఈ లైన్ ద్వారా సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది. బీఎంటీ లే అవుట్, హెచ్ఎస్ఆర్ లే అవుట్, బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలకు మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది. యెల్లో లైన్ గ్రీన్, బ్లూ, పింక్ లైన్లను కలుపుతుంది.
Read Also: Heart Attack: గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి.. పిల్లల్లో హార్ట్ఎటాక్లు పెరగడానికి కారణాలు ఇవే..
ఎల్లో లైన్ స్టేషన్ల వివరాలు:
* RV రోడ్: ఇది గ్రీన్ లైన్‌తో ఇంటర్చేంజ్
* రాగిగుడ్డ
* జయదేవ హాస్పిటల్: ఇది పింక్ లైన్‌తో భవిష్యత్తులో ఇంటర్చేంజ్ అవుతుంది
* BTM లేఅవుట్
* సెంట్రల్ సిల్క్ బోర్డ్: ప్రయాణికులు భవిష్యత్తులో బ్లూ లైన్‌తో ఇంటర్చేంజ్ చేసుకోగలరు.
* బొమ్మనహళ్లి
* హొంగసంద్ర
* కుడ్లు గేట్
* సింగసంద్ర
* హోసా రోడ్
* బెరటేన అగ్రహార
* ఎలక్ట్రానిక్ సిటీ
* కోనప్పన అగ్రహార
* హుస్కూర్ రోడ్
* హెబ్బగోడి
* బొమ్మసాంద్ర (టెర్మినల్)
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!