Site icon NTV Telugu

Bengaluru: బెంగళూర్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో ‘‘ఎల్లో లైన్’’ ప్రారంభానికి సిద్ధం.. స్టేషన్లు ఇవే..

Bengaluru Metro Yellow Line

Bengaluru Metro Yellow Line

Bengaluru: బెంగళూర్‌లోని నమ్మ మెట్రో ‘‘ఎల్లో లైన్’’ త్వరలో ప్రారంభంకాబోతోంది. రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్), బొమ్మసంద్రను కలిపే ఈ మెట్రో లైన్ తుది భద్రతా తనిఖీలు చేస్తు్న్నారు. జూలై 22 నుండి జూలై 25 వరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS) ఈ భద్రతా తనిఖీని నిర్వహిస్తారు. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది.

బెంగళూర్‌లో కనెక్టివిటీ మరింత పెంచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, గ్రీన్-పింక్ లైన్స్ డైరెక్ట్ ఇంటర్‌చేంజ్‌ను అందించడం ఎల్లో లైన్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల చాలా జాప్యాన్ని ఎదుర్కొంది. పలుమార్లు డెడ్‌లైన్ మిస్ అయింది. తాజా నివేదికల ప్రకారం, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఈ సంవత్సరం ఆగస్టులో ఈ లైన్‌ను ప్రారంభించనుంది. ముందుగా ఈ మార్గంలో మూడు మెట్రో రైళ్లను నడపనున్నారు. ఆ తర్వాత మరిన్ని జోడించే అవకాశం ఉంది.

ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి ఐటీ సంస్థలకు నిలయంగా ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా ఎల్లో లైన్ వెళ్తుంది. ఈ లైన్ ద్వారా సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది. బీఎంటీ లే అవుట్, హెచ్ఎస్ఆర్ లే అవుట్‌, బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలకు మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది. యెల్లో లైన్ గ్రీన్, బ్లూ, పింక్ లైన్లను కలుపుతుంది.

Read Also: Heart Attack: గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి.. పిల్లల్లో హార్ట్‌ఎటాక్‌లు పెరగడానికి కారణాలు ఇవే..

ఎల్లో లైన్ స్టేషన్ల వివరాలు:

* RV రోడ్: ఇది గ్రీన్ లైన్‌తో ఇంటర్‌చేంజ్
* రాగిగుడ్డ
* జయదేవ హాస్పిటల్: ఇది పింక్ లైన్‌తో భవిష్యత్తులో ఇంటర్‌చేంజ్ అవుతుంది
* BTM లేఅవుట్
* సెంట్రల్ సిల్క్ బోర్డ్: ప్రయాణికులు భవిష్యత్తులో బ్లూ లైన్‌తో ఇంటర్‌చేంజ్ చేసుకోగలరు.
* బొమ్మనహళ్లి
* హొంగసంద్ర
* కుడ్లు గేట్
* సింగసంద్ర
* హోసా రోడ్
* బెరటేన అగ్రహార
* ఎలక్ట్రానిక్ సిటీ
* కోనప్పన అగ్రహార
* హుస్కూర్ రోడ్
* హెబ్బగోడి
* బొమ్మసాంద్ర (టెర్మినల్)

Exit mobile version