Bengaluru Horror: బెంగళూర్ లో భయానక ఘటన సంభవించింది. రైల్వే స్టేషన్ లో ఓ డ్రమ్ములో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభించింది. యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం 1లో చెత్త డ్రమ్ ను శుభ్రపరిచే సమయంలో మృతదేహాన్ని గుర్తించారు. దుర్వాసన రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Pakistan: పాకిస్తాన్ మూడు ముక్కలు కానుందా..? బలూచిస్తాన్, ఖైబర్ ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు..
డ్రమ్ లో మృతదేహంపై బట్టలు కప్పి ఉన్నాయి. ఆధారాల కోసం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధారాల కోసం వెతుకుతున్నారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లోని బాక్స్‌లో కుళ్ళిపోయిన మృతదేహాన్ని శుభ్రపరిచే సిబ్బంది కనుగొన్నారని.. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాల కోసం వెతుకుతున్నారని.. సౌత్ వెస్ట్రన్ రైల్వే బెంగళూర్ డివిజన్, అదనపు రైల్వే మేనేజర్ కుసుమ హరిప్రసాద్ తెలిపారు. మరణించిన మహిళ వయసు 20 ఏళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.
