NTV Telugu Site icon

Bengaluru: దారుణం.. కుక్కను కారుతో ఢీకొట్టి చంపిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్

Bengalurudog

Bengalurudog

రోజురోజుకు మనుషుల్లో మానవత్వం పోతుంది. మనిషి.. మనిషిగా ఉండడం లేదు. జాలి, దయ ఉండాల్సింది పోయి.. క్రూరత్వం పెరిగిపోతోంది. చదువులేనివాడు మూర్ఖంగా ప్రవర్తించాడంటే బుద్ధిలేనివాడు అనుకోవచ్చు. కానీ చదువుకున్నోళ్లు పది మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఎందుకంటారా? బెంగళూరులో డిజిటల్ కంటెంట్ క్రియేటర్.. అత్యంత నీచంగా ప్రవర్తించాడు. రోడ్డుపై సేదదీరుతున్న మూగజీవంపైకి కారు ఎక్కించి హతమార్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: జిన్‌పింగ్‌ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..

బెంగళూరులోని జేనీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఎస్‌యూవీ కారుతో వీధి కుక్కను ఢీకొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పారవేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న కారు ఓనర్‌ను గుర్తించారు. నిందితుడు జేపీనగర్‌లోని శేఖర్ లేఅవుట్ నివాసి అయిన మంజునాథ్ వెంకటేష్‌గా గుర్తించారు. జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియోలో మంజునాథ్ ఉద్దేశ పూర్వకంగా కుక్కపైకి దూసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Xiaomi Pad 7: మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ కొత్త ప్యాడ్ 7.. ధర ఎంతంటే?

అయితే ఈ ఘటన డిసెంబర్ 31, సాయంత్రం 5:30 గంటలకు శేఖర్ లేఅవుట్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియోలో ఎస్‌యూవీ ఎడమ టైర్ కుక్కను ఢీకొట్టింది. విలవిలలాడుతో కుక్క ప్రాణాలు వదిలింది. పక్కనే ఉన్న కుక్కలు.. చుట్టూ మూశాయి. చాలా సేపు ధీనంగా చూశాయి. అనంతరం కుక్క మృతదేహాన్ని నిందితుడు బ్యాగ్‌లో వేసుకుని పారవేశాడు.

అయితే తాను కార్యాలయానికి వెళ్తుండగా పొరపాటున కారు ఢీకొట్టిందని నిందితుడు మంజునాథ్ పోలీసులకు అబద్ధం చెప్పాడు. కుక్కను గమనించకపోవడంతోనే చనిపోయిందని కహానీ చెప్పాడు. కానీ వీడియోలో మాత్రం ఉద్దేశ పూర్వకంగానే జరిగినట్లుగా కనిపించడంతో.. నిందితుడిపై చట్టం-1960 మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 325 (జంతువును చంపడం లేదా వైకల్యం చేయడం ద్వారా దుష్ప్రవర్తన) కింద అభియోగాలు మోపారు. మంజునాథ్‌ను అరెస్ట్ చేసి.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.