Site icon NTV Telugu

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశం

Nirmala

Nirmala

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌నగర పీఎస్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మలా బెదిరించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్‌ అయ్యర్‌ అనే వ్యక్తి గతంలో తిలక్‌నగర పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు వెళ్తే.. అతడి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.

Read Also: Ramajogaiah Sastry: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి దండం పెట్టిన రామజోగయ్య శాస్త్రి

ఇక, దీనిపై విచారణ పూర్తి చేసిన జడ్జ్ సంతోశ్‌ గజానన హెగ్డే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కాగా చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలతోనైనా పోలీసులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై కేసు నమోదు చేస్తారో లేదో అనేది వేచి చూడాలి.

Exit mobile version