NTV Telugu Site icon

Karnataka: సీఎం సిద్ధరామయ్య, డీకే.శివకుమార్‌లకు కోర్టు సమన్లు.. ఏ కేసులో అంటే..!

Karnataka

Karnataka

2022 నిరసనకు సంబంధించిన కేసులో బెంగళూరు కోర్టు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఆగస్టు 29న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇద్దరి నేతలకు బెంగళూరు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వేధిస్తున్నారంటూ ‘ఈడీ’కి వ్యతిరేకంగా 2022లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో అప్పటి ప్రతిపక్ష నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Naga Chaitanya- Sobhita Dhulipala: ఇదంతా ముందే తెలుసా?

ఈ నిరసన ప్రజా శాంతికి విఘాతం కలిగించిందని, అలాగే అధికారుల అనుమతి లేకుండా నిర్వహించినందుకు విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే నిరసనపై శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసును మాత్రం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తాజాగా ఇరు నేతలకు సమన్లు జారీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: 2 Rupees Biryani Offer: రూ. 2కే చికెన్‌ బిర్యానీ.. ఎగబడిన జనం..