Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారన వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులకు సహకరించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేయగా.. ఇద్దరు నిందితులు ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలపై ఎన్ఐఏ భారీ రివార్డు ప్రకటించింది. వీరి ఆచూకీ తెలిపిన వారికి రూ. 20 లక్షల్ని ప్రకటించింది. ఈ ఇద్దరూ ఈ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. అనుమానితులపై సమాచారం తెలిసిన వ్యక్తులు info.blr.nia@gov.in ఇమెయిల్ ద్వారా లేదా కాల్ ద్వారా తమని సంప్రదించాలని ఎన్ఐఏ కోరింది.
Read Also: Gouri Kishan: సైలెంటుగా పెళ్లి చేసుకున్న 96 నటి.. కానీ అసలు ట్విస్ట్ అదే?
అయితే, గుర్తింపు దాచడానికి షాజిబ్ మహ్మద్ ‘జునేద్ సయ్యద్’ అనే పేరును ఉపయోగిస్తున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. అదే విధంగా అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా హిందువుగా గుర్తింపు పత్రాలను ఉపయోగిస్తున్నాడని, విఘ్నేష్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు తయారు చేసినట్లు ఏన్ఐఏ తెలిపింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామని హామీ ఇయ్చింది.
కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 18 చోట్ల ఎన్ఐఏ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఈ కేసులో సహ కుట్రదారుగా ఉన్న ముజమ్మిల్ షరీఫ్‌ని మార్చి 28న దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. షరీఫ్‌తో సహా ముగ్గురు అనుమానితుల ఇళ్లు, దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు ఘటనలో షరీఫ్ లాజిస్టిక్ సపోర్ట్ అందించాడని ఎన్ఐఏ పేర్కొంది. మార్చి 1న బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. కస్టమర్‌గా వచ్చిన ఉగ్రవాది టైమర్ అమర్చిన ఐఈడీ బాంబు కలిగిన బ్యాగ్‌ని అక్కడే వదిలి పేలుడు సంభవించేలా చేశాడు.