Site icon NTV Telugu

Auto Driver Wins Hearts: అర్థరాత్రి రోడ్డుపై ఒంటరిగా ఆటోలో వెళుతున్న మహిళ..ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా.,

Untitled Design (11)

Untitled Design (11)

సాధారణంగా అర్థరాత్రి సమయంలో మహిళలు రోడ్లపై ప్రయాణించాలంటే భయపడిపోతుంటారు. ఎవరి తోడు లేకుండా ప్రయాణించాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే అర్థరాత్రి బెంగుళూరులో ఆటోలో ప్రయాణించిన మహిళకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఓ మహిళ అర్థరాత్రి రాపిడో ఆటోలో ఒంటరిగా ప్రయాణించింది. దీంతో ఆమెకు ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ ప్రవర్తన తనకు పూర్తిస్థాయి భద్రతను కలిగించిందని ఆమె తెలిపింది. ఆటోలో అతికించిన చేతిరాత నోటీసులో “నేను కూడా ఓ తండ్రిని, ఓ అన్నను. మీ భద్రతే నాకు ముఖ్యం. సౌకర్యంగా కూర్చోండి” అని ఉండటాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయినప్పటికీ, ఆ చిన్న సందేశమే తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని ఆమె పేర్కొంది. గమ్యస్థానానికి చేరుకునే వరకు ఎలాంటి భయం గానీ, ఆందోళన గానీ కలగలేదని తెలిపింది. ఆటోలో రాసి ఉన్న చేతి రాతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతుంది. హిళల భద్రతపై ఆ డ్రైవర్ చూపిన శ్రద్ధను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Exit mobile version