Site icon NTV Telugu

Bengaluru: ఎయిర్‌పోర్టులో దారుణం.. తనిఖీ నెపంతో ఆపి కొరియన్ మహిళపై అఘాయిత్యం!

Bengaluru

Bengaluru

టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. కొరియా మహిళా పర్యాటకురాలిపై మృగాడు అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విమానాశ్రయ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జనవరి 19న ఎయిర్‌పోర్టుకు కొరియన్ మహిళ వచ్చింది. అయితే టికెట్, సామాన్లు తనిఖీ నెపంతో అఫాన్ అహ్మద్ అనే ఉద్యోగి.. మహిళను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. చెక్‌-ఇన్ దగ్గర బ్యాగ్ బీప్ అవుతుందని.. కౌంటర్‌లో తనిఖీ చేయడం వల్ల విమానం ఆలస్యం అవుతుందని.. వ్యక్తిగతంగా తనిఖీలు చేయాలంటూ పురుషుల వాష్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. ప్యాంట్ డౌన్ చేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో బాధితురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆమెతో ఇష్టానురీతిగా అనుచితంగా ప్రవర్తించిన తర్వాత నిందితుడు ‘‘సరే.. ధన్యవాదాలు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

ఈ పరిణామంతో షాకైన బాధితురాలు వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎయిరిండియా క్షమాపణ..
నిందితుడు అఫాన్ అహ్మద్.. విమానాశ్రయంలో గ్రౌండ్, కార్గో సేవలను అందించే ఎయిరిండియా SATSలో పని చేస్తున్నాడు. అయితే ఈ సంఘటన ‘క్షమించరానిదిగా’ భావించిన ఎయిరిండియా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది. చట్టపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ సంఘటనకు చింతిస్తున్నామని.. బాధితురాలికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. ప్రయాణికులకు భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

Exit mobile version