Site icon NTV Telugu

Sudipa Chatterjee: “బీఫ్‌”ని ప్రమోట్ చేసినందుకు నటికి బెదిరింపులు..

Sudipa Chatterjee

Sudipa Chatterjee

Sudipa Chatterjee: బంగ్లాదేశ్ కుకింగ్ షోలో పాల్గొన్న బెంగాలీ నటి సుదీపా ఛటర్జీ వివాదంలో ఇరుక్కుంది. షోలో యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక పార్టిసిపెంట్ ‘‘బీఫ్’’ వంటకాన్ని తయారు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. బీఫ్‌ వంటకాన్ని తయారు చేసిన పార్టిసిపేటెంట్‌తో ఇంటరాక్ట్ కావడంతో కొందరికి నచ్చలేదు. సదరు వ్యక్తితో సుదీప మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి తోడు సుదీపకి అధికార తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రమంత్రి బాబుల్ సుప్రియోతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా సోషల్ మీడియాలో ఈమెపై విమర్శలు రావడానికి కారణమైంది.

Read Also: Navneet Kaur Rana: అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ

రాజకీయ ప్రయోజనాల కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని సుదీప క్లారిటీ ఇచ్చింది. ‘‘నన్ను ట్రోల్ చేస్తున్న చాలా మంది వ్యక్తులు ఈ వీడియోను చూడలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేనెప్పుడూ బీఫ్ తినలేదు, వండను కూడా తినలేదు. దానిని ముట్టుకోలేదు. కరీం జహాన్(షోలో పాల్గొన్న వ్యక్తి) వండటం ప్రారంభించలేదు’’ అని ఆమె అన్నారు. ఫేస్‌బుక్ లైవ్‌లో అక్కడ ఎందుకు నిలుచున్నారని అడిగారని, బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా’ వస్తున్నప్పుడు తాను ఎందుకు కదలాలి అని అన్నారు. బంగ్లాదేశ్ జాతీయ వంటకాల్లో బీఫ్ ఒకటని షో నిర్వాహకులు చెప్పారని తెలిపారు. నేను బంగ్లాదేశ్‌లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లానని సుదీప చెప్పుకొచ్చారు. తాను ఒక లౌకికదేశానికి చెందిన వ్యక్తినని, క్రికెట్ మైదానంలో బంగ్లా జాతీయగీతం వచ్చినప్పుడు మన ఆటగాళ్లు కదలకుండా నిలుచుంటున్నారని ఆమె గుర్తు చేశారు.

ఇటీవల షో కారణంగా సీఎం మమతా బెనర్జీ, మంత్రి బాబుల్ సుప్రియోపై విమర్శలు వస్తున్నాయని, అయితే తనకు తృణమూల్ తో కానీ ఇతర ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని ఆమె స్పష్టం చేశారు. నా ఫోటోలు పెట్టి వీరిద్దరిని తిడుతున్నారని చెప్పారు. బీజేపీ పేరుతో తనకు అనేక బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని ఆరోపించారు. తను సజీవ దహనం చేయడంతో పాటు నా తల్లి, కొడుకుని కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version