Mood of the Nation Survey 2026: దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సొంతగా 287 సీట్లను సాధించి అధికారంలోకి వస్తుందని, ఎన్డీయే కూటమి 350కిపైగా స్థానాలు సాధిస్తుందని ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1.25 లక్షల కంటే ఎక్కువ మంది అభిప్రాయాలతో ఈ సర్వే చేసింది.
Read Also: Mahindra BE 6: మంటల్లో కాలిన మహీంద్రా BE 6 కార్.. అసలు కారణం ఇదే..
మరోవైపు, బెంగాల్ విషయానికి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లోని ఫలితాలనే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రిపీట్ చేస్తుందని వెల్లడించింది. బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ సీట్లలో 29 గెలిచింది. బీజేపీ కేవలం 12 సీట్లలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2026 మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో, ఈ రోజే సార్వత్రిక ఎన్నికలు జరిగితే తృణమూల్ కాంగ్రెస్ సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గి 28 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీ తన సీట్లను స్వల్పంగా పెంచుకుని 14 స్థానాలు సాధించే ఛాన్స్ ఉందని చెప్పింది.
