Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
- బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని బంగ్లాదేశ్‌లో భయం..
- అక్రమ వలసదారులు బంగ్లాకు వస్తారని ఆందోళన..
- వలసదారుల్ని భారత్ వెనక్కి నెట్టేస్తుందని ఎంపీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై మన దేశంలోనే కాదు, సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్‌లో కూడా ఆసక్తిగా మారింది. ఎంతలా అంటే, బీజేపీ గెలిస్తే తమ పరిస్థితి ఏంటని ఆ దేశంలో కొందరు రాజకీయ నాయకులు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. బంగ్లాదేశ్ ఎన్సీపీ కార్యదర్శి, ఎంపీ అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధిస్తే, అక్రమ బంగ్లాదేశీయులను బంగ్లాదేశ్‌కు సాగనంపే ప్రక్రియ మొదలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, లక్షలాది మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌లోకి నెట్టివేయబడే అవకాశం ఉందని, ఇది ఢాకాలో శరణార్థుల సంక్షోభాన్ని పెంచుతుందని బంగ్లా నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో బీజేపీ గెలుపు అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్ నుంచి పంపించేందుకు దారితీయొచ్చని అన్నారు. బంగ్లాదేశ్‌లోకి సముద్రంలా వలసలు వచ్చి పడుతాయని, భారత్ నుంచి ముస్లిం వలసదారుల్ని వెనక్కి పంపరనే గ్యారెంటీ లేదని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్ నాయకుడి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. అక్రమ చొరబాట్లపై టీఎంసీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తృణమూల్ సహాయకులు నెమ్మదిగా తెరపైకి వస్తున్నారని అన్నారు. అక్తర్‌కు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.
बंगलादेश के सांसद अख़्तर हुसैन ने आज बांग्लादेश के संसद में कहा कि भाजपा की पश्चिम बंगाल की जीत घुसपैठ को रोकेगी और बांग्लादेशी मुसलमानों को भगाएगी,यह ख़तरनाक है । तृणमूल कांग्रेस के मददगार धीरे-धीरे सामने आ रहे हैं pic.twitter.com/wt1ZZUK7Un
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 30, 2026
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!