బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. నిన్నటి రోజున ప్రధాని మోడిని కలిసిన తరువాత, కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కాగా ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, పెగాసస్ వ్యవహారం, వ్యాక్సినేషన్‌పై సోనియా గాంధీతో చర్చించారు. అదేవిధంగా విపక్షాలను ఏకం చేసి 2024 ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే లక్ష్యంతో ఆమె పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సోనియాతో చర్చించారు. కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మమతా బెనర్జీ కలవబోతున్నారు. విపక్షాలను ఏకం చేసిన తరువాత కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారు అన్నతి అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని, ఫలానా వారు నేతృత్వం వహిస్తారు అని చేప్పేందుకు తానేమి రాజకీయ జ్యోతిష్యురాలిని కాదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 2024లో ఎన్నికలు వస్తే అది మోడీకి, దేశానికి మధ్యే జరుగుతాయని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 2024లో దేశంలో బీజేపీని తప్పకుండా ఓడిస్తామని దీదీ ధీమా వ్యక్తం చేశారు.
2024 ఎన్నికలపై బెంగాల్ సీఎం కీలక వ్యాఖ్యలు…
