Beautification of Yakub Memon’s grave.. CM Eknath Shinde ordered the investigation: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ సమాధిని సుందరీకరించడంపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై సీఎం ఏక్ నాథ్ షిండే విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంపై విచారాణ చేసి నివేదిక సమర్పించాలని ముంబై పోలీసులను సీఎం ఆదేశించారు. గత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హయాంలో యాకుబ్ మెమన్ సమాధిని సుందరీకరించడంపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ విమర్శలు గుప్పించారు. ఒక ఉగ్రవాది సమాధిని మజార్ గా మార్చడం ఉద్దవ్ ఠాక్రే దేశభక్తికి నిదర్శనం అని విమర్శలు గుప్పించారు. పాక్ ఆదేశాల ప్రకారం ముంబైలో మారణహోమానికి పాల్పడిన ఉగ్రవాది యాకుబ్ మెమన్ సమాధిని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హయాంలో సుందరీకరించారని..దీనిపై శరద్ పవార్, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రామ్ కదమ్ డిమాండ్ చేశారు.
Read Also: Brahmastra Movie Review: బ్రహ్మాస్త్ర పార్ట్ 1 – శివ రివ్యూ (హిందీ డబ్బింగ్)
దక్షిణ ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో మెమన్ సమాధి సుందరీకరణపై మహారాష్ట్రలో రాజకీయా వివాదం చెలరేగింది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో యాకుబ్ మెమన్ సమాధి మట్టితో ఉండేది.. ప్రస్తుతం అక్కడ పాలరాతితో సమాధిని తీర్చిదిద్దారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లను సీఎం ఆదేశాల తర్వాత పోలీసులు నిలిపివేశారు. అయితే ఏ ఉగ్రవాదిని కీర్తించరాదని.. మెమన్ సమాధిని తీర్చిదిద్దడాన్ని అనుమతించబోమని ఎన్సీపీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అన్నారు. కాాగా.. బీజేపీ విమర్శలను ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం తిప్పికొట్టింది. మెమన్ ను ఉరి తీసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అంత్యక్రియల కోసం ఇవ్వడాన్ని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. యూపీఏ హాయాంలో అఫ్జల్ గురు, పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ఉరితీసినప్పుడు వారి మృతదేహాలను రహస్యంగా ఖననం చేశామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అతుల్ లోండే అన్నారు.
1993 ముంబై వరస పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు కేవలం యాకుబ్ మెమన్ కు మాత్రమే ఉరిశిక్ష విధించబడింది. మార్చి 12, 1993న ముంబైలో వరస పేలుళ్లు జరిగాయి. 257 మంది మరణించగా.. 700 మంది గాయపడ్డారు. సుమారు రూ.27 కోట్ల విలువైన ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ కేసును సీబీఐ విచారించింది. జూన్ 16, 2017న ముస్తఫా దోస్సా, అబూ సలెేంతో పాటు మరికొంత మంది ఈ కేసులో దోషులుగా నిర్థారించబడ్డారు. అయితే ఈ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం మాత్రం ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటున్నట్లు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.
