Site icon NTV Telugu

Haryana: విషాదం.. బాస్కెట్‌బాల్ పోల్ విరిగి క్రీడాకారుడు మృతి

Haryana

Haryana

మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి దాకా కళ్ల ముందు తిరిగిన వాళ్లే అంతలోనే విగతజీవిగా మారడం జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి ఘటనే హర్యానాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Droupadi Murmu: భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది.. రాజ్యాంగ దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి వ్యాఖ్య

హర్యానాలోని రోహ్‌తక్‌ చెందిన క్రీడాకారుడు లఖన్ మజ్రా గ్రామంలో బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా బాస్కెట్‌బాల్ స్తంభం కూలిపోయింది. పోల్ మీద పడగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. సమీపంలోని క్రీడాకారులంతా స్తంభం లేపి ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా ప్రాణాలు నిలవలేదు. చికిత్స పొందుతూ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరొకరు అరెస్ట్.. ఉమర్‌తో ఎలాంటి సంబంధం ఉందంటే..!

 

 

Exit mobile version