Site icon NTV Telugu

Bank Holidays In June: జూన్ నెలలో 12 రోజలు పాటు మూతపడనున్న బ్యాంకులు..

Bank Holidays In June

Bank Holidays In June

Bank Holidays In June: జూన్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. ఏకంగా 12 రోజలు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో బ్యాంకులు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవుల్లో ఆదివారాలు, రెండవ-నాల్గవ శనివారాలు ఉన్నాయి. ఆర్బీఐ ప్రతీ నెల బ్యాంకు సెలవులకు సంబంధించిన సెలవుల జాబితాను సిద్ధం చేస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే మరియు బ్యాంక్‌ల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అనే మూడు కేటగిరీల కింద సెలవులు ఉంటాయి.

Read Also: Delhi Girl Murder Case: ఢిల్లీ మర్డర్‌ కేసు నిందితుడికి పోలీస్‌ కస్టడీ..

జూన్ నెలలో ఆర్బీఐ బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. రీజినల్ హాలిడేస్ కారణంగా బ్యాంకులు ఆరు రోజులు మూసివేయబడుతున్నాయి. వీటిలో ఖర్చిపూజ, బక్రీద్, రాజా సంక్రాంతి వంటి పండగలు ఉన్నాయి. బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సెలవుల్లో బ్యాంకులు మూతపడినప్పటికీ.. ఆన్ లైన్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

జూన్ నెలలో బ్యాంకు హాలిడే జాబితా ఇదే:

జూన్ 4: మొదటి ఆదివారం

జూన్ 10: రెండవ శనివారం

జూన్ 11: రెండవ ఆదివారం

జూన్ 18: మూడవ ఆదివారం

జూన్ 24: నాల్గవ శనివారం

జూన్ 25: నాల్గవ ఆదివారం

జాతీయ మరియు ప్రాంతీయ సెలవులు:

జూన్ 15: Y.M.A డే/రాజ సంక్రాంతి – ఐజ్వాల్ మరియు భువనేశ్వర్.

జూన్ 20: కాంగ్ (రథజాత్ర)/రథ యాత్ర – భువనేశ్వర్ మరియు ఇంఫాల్

జూన్ 26: ఖర్చి పూజ – అగర్తల

జూన్ 28: బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) – బేలాపూర్, జమ్ము, కొచ్చి, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్ మరియు తిరువనంతపురం.

జూన్ 29: బక్రీద్ (ఈద్-ఉల్-అధా) – బేలాపూర్, భువనేశ్వర్, గాంగ్‌టక్, కొచ్చి, ముంబై, నాగ్‌పూర్ , తిరువనంతపురం మినహా మిగిలిన ప్రాంతాల్లో సెలవు.

జూన్ 30: రెమ్నా ని/ఇద్-ఉల్-జుహా – ఐజ్వాల్ మరియు భువనేశ్వర్.

జులైలో, ప్రాంతీయ సెలవుల కారణంగా బ్యాంకులు ఎనిమిది రోజుల పాటు మూతపడతాయి.

Exit mobile version