Site icon NTV Telugu

Vijay Diwas: 50 ఏళ్లలో తొలిసారిగా.. విజయ్ దివాస్‌కి బంగ్లాదేశ్ ముక్తి యోధులు గైర్హాజరు..

Vijay Diwas

Vijay Diwas

Vijay Diwas: భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అక్కడి మహ్మద్ యూనస్ పాలనలో హిందువులపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఇటీవల కాలంలో హిందువులు ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లు, గుడులపై మతోన్మాద మూక దాడులు చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గతంలో ఉన్నట్లుగా సంబంధాలు లేవు.

Read Also: ACC Chairman Shammi Silva: ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త ఛైర్మన్‌గా షమ్మీ సిల్వా

ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో ఈ ఏడాది జరగబోయే ‘విజయ్ దివస్’’ వేడుకలకు బంగ్లాదేశి ముక్తి యోధులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రతీ ఏడాది డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటారు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయ్ దివస్ జరుపుకుంటున్నాము. భారత బలగాలతో కలిసి బంగ్లాదేశ్ గెరిల్లా రెసిస్టెంట్ ఫోర్స్ అయిన ‘‘ముక్తి బాహిని’’ బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడింది. గత 50 ఏళ్లుగా విజయ్ దివస్ సందర్భంగా ముక్తి యోధులు హాజరువుతున్నారు.

అయితే, ప్రస్తుతం ఈ ఈవెంట్‌కి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌లో వారి బంగ్లా యోధులకు సంబంధించిన ఎలాంటి ప్రణాళిక లేదు. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. 1971 యుద్ధంలో ముక్తి బాహిని భారత సైన్యానికి సహకరించింది. పాకిస్తాన్ ఆర్మీ మన ముందు లొంగిపోయేందుకు కారణమైంది. బంగ్లాదేశ్ పుట్టుకకు దారి తీసింది.

Exit mobile version