Site icon NTV Telugu

Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత

Bangladeshimodelsantapaul

Bangladeshimodelsantapaul

కోల్‌కతాలో బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డును స్వాధీనం చేసుున్నారు. అంతేకాకుండా పలు బంగ్లాదేశ్ పాస్‌పోర్టులు, రీజెంట్ ఎయిర్‌వేస్(బంగ్లాదేశ్) ఉద్యోగి కార్డు, ఢాకాలోని సెకండరీ విద్యకు సంబంధించిన అడ్మిట్ కార్డు, వేర్వేరు చిరునామాలతో నమోదు చేయబడిని రెండు భారతీయ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఆమెకు ఎలా వచ్చాయని అధికారులు షాక్ అయ్యారు. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే వీసా లేకుండానే ఆమె భారతదేశంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. ఆగస్టు 8 వరకు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది.

ఇది కూడా చదవండి: US- India Tariffs: నేటి నుంచి భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఏ ఏ రంగాలను ప్రభావితం చేయనుందంటే..?

నిందితురాలు బంగ్లాదేశ్‌లోని బారిసాల్‌కు చెందిన శాంతా పాల్ (28) గా గుర్తించారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. నివాసంలో ఉండగా అరెస్టు చేశారు. ఆమె నుంచి రెండు ఆధార్ కార్డులు, ఓటరు కార్డు, రేషన్ కార్డు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి పవన్‌ ఝలక్‌లు ఇస్తున్నారా?.. డూడూ బసవన్నను కాదని చెప్పదల్చుకున్నారా?

గతేడాది చివరిలో ఆమె కోల్‌కతాకు వచ్చినట్లుగా గుర్తించారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేయగా.. బుధవారం నగర కోర్టులో హాజరు పరచగా ఆగస్టు 8 వరకు కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం ఆమెకు ఆధార్ కార్డు ఎలా ఇచ్చారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధార్ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే ఓటర్, రేషన్ కార్డులు కూడా ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతాపాల్ బంగ్లాదేశ్‌లో నటిగా కూడా పని చేసినట్లుగా సమచారం. అంతేకాకుండా అనేక టీవీ ఛానెల్స్‌లో.. షోల్లో యాంకర్‌గా పని చేసిందని.. అలాగే అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్లుగా పోలీసులు కనుగొన్నారు.

ఇది కూడా చదవండి: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఇదేనా..?

Exit mobile version