Site icon NTV Telugu

Bangladesh: షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించిన బంగ్లాదేశ్..

Hasina

Hasina

Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా దిగిపోయిన తర్వాత, ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాని అప్పగించాలని పలుమార్లు భారత్‌ని కోరింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించింది.

Read Also: Azharuddin: ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ పేరు తొలగింపు.. అజారుద్దీన్‌ రియాక్షన్ ఇదే..

మాజీ ప్రధానితో సహా 12 మంది వ్యక్తులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ని బంగ్లాదేశ్ అభ్యర్థించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది ఆగస్టులో హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా భారత్‌కి పారిపోయి వచ్చారు. బంగ్లా కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఆమెను అప్పగించాలని కోరుతున్నాయి.

బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) హసీనా, అనేక మంది మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక – పౌర అధికారులపై “మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మరియు మారణహోమం” కింద అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అప్పటి నుంచి ఆమెను భారత్‌ నుంచి తీసుకురావడానికి బంగ్లాదేశ్ అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది.

Exit mobile version