NTV Telugu Site icon

India vs China: భారత్ను ఒంటరి చేయాలని చైనా, పాక్ ప్లాన్.. మన పొరుగు దేశాలలో కుట్రలు..!

China

China

India vs China: తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు డ్రాగన్ కంట్రీ కుట్రలకు పాల్పడుతుంది. భారతే చైనాకు టార్గెట్‌ అయినా.. ముందుగా పొరుగు దేశాలను డిస్ట్రబ్ చేస్తూ.. భారత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలను ఒక్కొక్క దానిని ఖతం చేస్తుంది. ఆ జాబితాలో పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ డ్రాగన్ కంట్రీ కుట్రలకు బలైపోయాయి.

Read Also: Manu Bhaker: స్వదేశానికి చేరుకున్న మను బాకర్‌.. ఢిల్లీలో ఘన స్వాగతం! శనివారం మళ్లీ పారిస్‌కు

అయితే, పాక్ మనకు ఆది నుంచే శత్రువుగా ఉంది.. అక్కడి నుంచే చైనా తన ఆపరేషన్ ప్రారంభించింది. నవాజ్ షరీఫ్‌ హయాంలో భారత్‌తో ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగించేందుకు ట్రై చేయగా.. ఆయన కథ క్లోజ్ చేసింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రయత్నించడంతో పాటు ఉక్రెయిన్‌ యుద్ధం టైంలో రష్యాలో పర్యటించడంతో పూర్తికాలం పదవిలో ఇమ్రాన్‌ ఖాన్‌ కొనసాగనివ్వకుండా చైనా కుట్ర చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెంచుతూ.. అక్కడ గ్వాదర్ ఓడరేవును డెవలప్‌ చేసి తమ ఆధీనంలోకి డ్రాగన్ కంట్రీ తెచ్చుకుంది.

Read Also: Bigboss: బిగ్ బాస్ 8కు హోస్ట్ గా కుర్ర హీరో.. ఈ సారి వేరే లెవల్..?

అలాగే, నేపాల్‌ భారత్‌కు పూర్తిగా సపోర్టుగా ఉంది. అలాంటి నేపాల్‌ ప్రచండ ప్రధానిగా ఉన్నంత వరకు బాగానే ఉండేది. కానీ, అతడ్ని తప్పించి.. కేపీ శర్మ ఓలీ ప్రధాని అయ్యారు. దీని వెనక చైనా వ్యూహాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతుంది. భారత్‌ అంటేనే గిట్టని వ్యక్తిగా పేరున్న కేపీ శర్మ.. 2021కి ముందు వరకు రెండుసార్లు నేపాల్ ప్రధాన మంత్రిగా పని చేశారు. ఆయన ప్రధాని అయ్యాక నేపాల్‌ కూడా భారత్‌కు వార్నింగ్ ఇవ్వడం ప్రారంభించింది.

Read Also: Gold Rate Today: వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇది కదా కావాల్సింది!

ఇక, నేపాల్ తర్వాత శ్రీలంకలో కుట్రలు స్టార్ట్ చేసిన డ్రాగన్ కంట్రీ.. కొలంబో ప్రధానిగా రాజపక్సే ఉన్నప్పుడు భారత్‌తో దొస్తీ కొనసాగించారు. సామరస్య పూర్వకంగా ఉంటూ మన సహాయం పొందారు. ఈ వాతావరణాన్ని పూర్తిగా డిస్ట్రబ్ చేసేందుకు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా చైనా పెద్ద ఎత్తున కుట్రలు చేసింది. ధరల పెరుగుదల, రోజుల తరబడి ఆందోళనలతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే మీద తిరుగుబాటు జరిగేలా ప్లాన్ చేయడంతో.. చివరకు రాజపక్సే దేశం వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రధాని అయిన దినేష్ గుణవర్ధనే చైనా చెప్పు చేతల్లో ఉండటంతో అక్కడి ఓడ రేపులు మొత్తం చైనా అధీనంలోకి వెళ్లిపోయాయి.

Read Also: Dorababu Pendem: వైసీపీకి మరో షాక్.. పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా

ఆ తర్వాత చైనా కుట్రలకు భారత్‌, మాల్దీవుల మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. డ్రాగన్ కంట్రీ ఆడిన నాటకంలో మాల్దీవులు బలైపోయింది. మాల్దీవులకి అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. దీంతో ఇండియా నుంచే వెళ్లే టూరిస్టుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో మాల్దీవులు ఇబ్బంది పడుతుంది. అయితే, ఇప్పుడు ఆ జాబితాలో బంగ్లాదేశ్‌ కూడా చేరిపోయింది. బంగ్లాదేశ్‌లో ఆరు నెలల క్రితం హల్‌చల్‌ చేసిన బాయ్‌కాట్‌ ఇండియా ఉద్యమం వెనక చైనా హస్తం ఉందనే ప్రచారం కొనసాగింది. భారత వస్తువుల బహిష్కరించాలంటు స్టార్టైన ఉద్యమం..రిజర్వేషన్ల పోరాటంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆమె భారత్‌తో సన్నిహతంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన డ్రాగన్ కంట్రీ కుట్రలు చేసి హసీనాను గద్దె దించడంలో విజయం సాధించింది.

Show comments