Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ అధికారంలోకి రావడంతో అక్కడి మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. భారత్ టార్గెట్‌గా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, బంగ్లాదేశ్ జమాతే ఇస్తామీ డిప్యూటీ లీడర్ అమీర్ సయ్యద్ అబ్దుల్లా మహ్మద్ తాహెర్ ‘‘ఘజ్వా-ఎ-హింద్’’ గురించి మాట్లాడుతూ, భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేందుకు మతోన్మాదులు తరుచూ ‘‘ఘజ్వా-ఏ-హిందూ’’ చేపడుతామని ప్రగల్భాలు పలుకుతుంటారు.
Read Also: Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, బంగ్లాదేశ్‌పై సైనిక చర్యకు ప్రయత్నిస్తే తాము యుద్ధం చేస్తామని తాహెర్ అన్నాడు. బంగ్లాదేశ్ అమెరికన్ అసోసియేషన్ న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రజా స్వాగత సభలో ప్రసంగిస్తూ.. జమాతే ఇస్లామి ‘‘ఘజ్వా ఎ హింద్ ’’ కు సిద్దంగా ఉందని పేర్కొన్నాడు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జమాతే ఇస్లామీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది. అయితే, ఆ కళంకాన్ని తుడిచేయడానికి భారత్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌లో 50 లక్షల మంది యువత సిద్ధంగా ఉన్నారు అని జమాత్ నేత చెప్పాడు.
“జమాత్ అధికారంలోకి వస్తే భారతదేశం బంగ్లాదేశ్‌పై దాడి చేయగలదని ప్రజలు నమ్ముతారు. వారు ప్రవేశించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది 1971లో మనపై ఉన్న కళంకాన్ని తొలగిస్తుంది మరియు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులుగా నిరూపించుకోవడానికి మాకు అవకాశం ఇస్తుంది’’ అని అన్నాడు. బంగ్లాదేశ్‌పై భారత్ దాడి చేస్తే షేక్ హసీనా మద్దతు ఇస్తుందని ఆరోపించాడు.
