BJP Leader: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదులు దాడులుకు పాల్పడుతున్నారు. గత రెండు వారాల్లో ముగ్గురు హిందువుల్ని దారుణంగా చంపేశారు. అయితే, దీని ప్రభావం బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌పై పడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇటీవల వేలంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కొనుగోలు చేసింది. దాదాపు రూ.9.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. అయితే, ఇప్పుడు ముస్తాఫిజుర్‌ను కొనుగోలు చేయడంపై బీజేపీతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.
యూపీకి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కొనుగోలు చేసిన షారూఖ్ ఖాన్‌ను ‘‘దేశద్రోహి’’గా అభివర్ణించారు. “ఒకవైపు బంగ్లాదేశ్‌లో హిందువులను చంపుతున్నారు, మరోవైపు ఐపీఎల్లో క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. దేశద్రోహి అయిన సినీ నటుడు షారుఖ్ ఖాన్ బంగ్లాదేశ్ క్రికెటర్ రెహమాన్‌ను రూ. 9 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇలాంటి దేశద్రోహులకు ఈ దేశంలో జీవించే హక్కు లేదు,” అని మీరట్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో సోమ్ అన్నారు. “ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చడానికి సహాయం చేశారు. మీకు డబ్బు వస్తే, అది ఈ దేశం నుండే వస్తుంది. కానీ మీరు దేశానికి ద్రోహం చేశారు,” అని అన్నారు.
రెహ్మాన్ వంటి ఆటగాళ్లు భారత్ వస్తే విమానాశ్రయం నుంచి బయటకు అడుగు పెట్టలేడు అని బీజేపీ నేత హెచ్చరించారు. ఆధ్యాత్మిక గురువు దేవకినందన్ ఠాకూర్ కూడా షారుఖ్ ఖాన్‌ను రెహమాన్‌ను కొనుగోలు చేసినందుకు తీవ్రంగా విమర్శించారు, అతనిని జట్టులో చేర్చవద్దని KKR యాజమాన్యానికి చెప్పారు. కేకేఆర్ యజమానిని స్టార్‌గా చేసిన హిందువులు, బంగ్లాదేశ్‌లో చంపబడుతుంటే, బాలికపై దాడులు జరుగుతుంటే, వాటిని పరిగణలోకి తీసుకోకుండా తన జట్టులోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకుంటున్నాని ఆయన అన్నారు.