NTV Telugu Site icon

Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్‌కి మరోసారి బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటేకి నాయకత్వం వహిస్తున్న హిందూ మతపెద్ద చిన్మోయ్ కృష్ణదాస్‌ని బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దోశద్రోహ కేసును ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం జైలులు ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి ఆయన బెయిల్ పిటిషన్‌ని అక్కడి కోర్టులు తిరస్కరించాయి. ఇప్పటికే ఒకసారి ఆయన బెయిల్ పిటిషన్‌ని బంగ్లాకోర్టులు పట్టించుకోలేదు.

చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎండీ సైఫుల్ ఇస్లాం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాస్ తరుపున న్యాయవాది లెటర్ ఆఫ్ అటార్నీ కలిగి లేనందున పిటిషన్ తిరస్కరించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 2కి మళ్లీ విచారణ జరగనుంది. డయాబెటిస్, శ్వాసకోశ సమస్యలతో దాస్ బాధపడుతున్నట్లు పిటిషన్ పేర్కొంది. ఆయనను తప్పుడు, కల్పిత కేసులో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 3న జరిగే విచారణకు ఆయన తరుపు న్యాయవాది సుభాశిష్ వర్మ హాజరుకాలేకపోయారని పిటిషన్ పేర్కొంది.

Read Also: DCP Narasimha : ఒకటి రెండు కాదు.. ఏకంగా 1100 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం

చిన్మోయ్ ముందస్తు బెయిల్ విచారణకు దరఖాస్తు చేసిన న్యాయవాది రవీంద్ర ఘోష్ తన తరపున కేసులో పోరాడేందుకు సుభాశిష్‌కి ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలేదని, చిట్టగాంగ్ మెట్రోపాటిలన్ సెషన్స్ కోర్టు జడ్జికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ మోఫిజుల్ హక్ భుయాన్ తెలిపారు. దీంతో ఆయన తరుపున న్యాయవాది సుభాశిష్ హాజరుకాలేదు. దీని తర్వాత న్యాయవాది రవీంద్ర ఘోష్ చేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించిందని ఆ దేశ మీడియా నివేదించింది.

ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల బెయిల్ విచారణ కూడా బుధవారం జరగాల్సి ఉండగా న్యయవాది గైర్హాజరు కావడంతో విచారణ జరగలేదు. హిందువులకు చట్టపరమైన హక్కులు ఉంన్నందున విచారణ న్యాయంగా పారదర్శకంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్‌ని భారత్ కోరింది.