NTV Telugu Site icon

Bengaluru: పోలీసుల్ని కించపరిచేలా టాటూ.. ఎఫ్ఐఆర్

Bengaluru

Bengaluru

టాటూ ఒక ఆర్టిస్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. ఛాతీపై పచ్చబొట్టు వేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ టాటూ పోలీసుల్ని కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుమోటోగా కళాకారుడిపై కేసు నమోదు చేశారు.

ఓ కళాకారుడు.. విదేశీయుడి ఛాతీపై ‘F**k the police’ టాటూ వేశాడు. దీన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశాడు. నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పచ్చబొట్టుపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఫొటోను పోలీసులకు లింక్ చేస్తూ షేర్ చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో పోలీసులు సుమోటాగా తీసుకుని కళాకారుడిపై కేసు నమోదు చేశారు. టాటూను చూసిన పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. పోలీసుల్ని కించపరిచేలా ఉందని.. ఉద్దేశపూర్వకంగానే అవమానించినట్లుగా ఉందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విదేశీయుడు కోరితేనే తాను పచ్చబొట్టు వేశానని కళాకారుడు పేర్కొన్నాడు. టాటూ సూత్ర స్టూడియోను నడుపుతున్న రితేష్ అఘరియా ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.