Site icon NTV Telugu

Mother Cruelty: కసాయి తల్లి.. నాలుగో అంతస్థు నుంచి కూతుర్ని పడేసింది

Child Died

Child Died

మానవత్వం మంటగలిసిపోతోంది. నవమాసాలు మోసి, పిల్లల్ని కనే తల్లి వారిని ఎంత కష్టమయినా పెంచి ప్రయోజకుల్ని చేస్తుంది. అలాంటి తల్లి తన కూతుర్ని నాలుగు అంతస్థుల పై నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకి పడేయడం కలకలం రేపుతోంది. బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది.

Komatireddy Rajagopalreddy Live: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్

బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపతో కలిసి అపార్ట్‌ మెంట్ బయట బాల్కనీలో తచ్చాడింది. మళ్ళీ లోపలికి వెళ్ళంది. పాపను రెయిలింగ్ మీద కూర్చోబెట్టింది. కానీ పిల్లను కిందకు తోచేయలేదు.మళ్ళీ ఇంట్లోకి పాపను తీసుకెళ్ళి… బయటకు తెచ్చింది. ఈసారి రెయిలింగ్ నుంచి పాపను అమాంతంగా కిందకు పడేసింది.

పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్‌ ఎక్కి కాసేపు నిలబడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు పరుగు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. అక్కడికి వచ్చి కింద దృశ్యం చూసి వారంతా షాకయ్యారు. నాలుగో అంతస్తు నుంచి కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్‌ఆర్‌ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్‌ కాగా.. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా. ‘తల్లి మానసిక పరిస్థితి సహా మేము అన్ని కోణాల్లో విచారిస్తున్నాము.’ అని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన కర్నాటకను కుదిపేసింది.

Mehbooba Mufti: ఏదో రోజు బీజేపీ తిరంగా జెండాను మార్చి కాషాయ జెండాను తీసుకువస్తుంది

Exit mobile version