Site icon NTV Telugu

Tiger Attack Mother Son : బిడ్డకోసం పులితో తల్లి పోరాటం.. తరువాత..!

Tiger Attack Mother Son

Tiger Attack Mother Son

Bandhavgarh tiger reserve tiger attack mother son mother fight bravely: ఓ తల్లి కొడుకు కోసం పోరాటం. తన కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసి, తన కంటికి రెప్పలా కాపాడిన తల్లికి తన బిడ్డ ప్రమాదంలో వుందంటే సహించలేక పోయింది. ఆ ప్రమాదంతో ఎదురు దాడికి దిగింది. తన ప్రాణాలకంటే తన బిడ్డను ప్రాణాలే ఆతల్లి కాపాడలని అనుకుంది. చివరకు ఆప్రమాదమే ఆతల్లి దాడికి తట్టుకోలేక వెనుతిరిగింది. ఆప్రమాదమే పులి. తన కన్నబిడ్డను ఆపులి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అది గమనించిన తల్లి తల కన్నబిడ్డకోసం ఆపులితో పోరాడింది. గాయాలైనా సరే తన బిడ్డకోసం ఆపులినే ప్రతిఘటించింది. పులి పంజాన నుంచి తన పదిహేను నెలల బాలున్ని కాపాడుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఉమరియా జిల్లాలోని బాంధవ్​గఢ్​ టైగర్​ రిజర్వ్ ప్రాంతంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రోహ్​నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్​, అర్చన దంపతులకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. తన బిడ్డ రవిరాజును తీసుకుని కాలకృత్యాలకై పొలానికి తీసుకెళ్లింది అర్చన. అక్కడికి ఇంతలో వచ్చిన పులి, వారిపై దాడి చేసింది, బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. దీంతో.. ఆచిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చననూ గాయపరిచింది. అయినా అర్చన అవేవీ లెక్కచేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది. దీంతో అర్చన కేకలు విని కొంత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకుని పులిని చెదరగొట్టారు. అయితే.. గాయపడిన తల్లీ, కుమారుడిని వెంటనే మన్​పుర్​లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ప్రథమ చికిత్సకోసం అక్కడి నుంచి ఉమరియా జిల్లా ఆస్పత్రికి తరలించారని ఫారెస్ట్​ గార్డ్​ రామ్​ సింగ్​ మార్కొ తెలిపారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడుఅయితే అటవీ ప్రాంతంలో ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని, ఆ పులి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే.. గాయాలపాలైన తల్లి, కుమారుడ్ని ఆ జిల్లా కలెక్టర్, ఆస్పత్రిలో​ పరామర్శించారు. ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం వారిని జబల్​పుర్​లోని ఆస్పత్రికి రిఫర్​ చేశామని పేర్కొన్నారు. ఇక అటవీ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల రక్షణ కోసం ఆటవీ శాఖతో సమావేశం నిర్వహించానని ఆయన తెలిపారు.
Rishi Sunak: ఓటమి తర్వాత స్పందించిన రిషి.. ఏం చెప్పారంటే?

Exit mobile version